Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Friday, January 22, 2010

Mudhabanthi puvva..



ముద్దబంతి పువ్వా.....




కలువ కన్నుల కన్నె


నిను ఏమని పొగడను


వాలు జడల వయ్యారి


నిను ఎలా వదలను




నీ మువ్వల సవ్వడి వినగానే


నా అడుగులు తడబడెను




నీ గాజుల గల గల అందగనే


నా మనసు వశము త ప్పెను




ప్పువ్వులతో చేసెనేటి నీ అధరలనా బ్రహ్మ


ముత్యాలు కూర్చిన ఆ ధారహాసం ఏమిటమ్మా??




పట్టు పరికినీ లోని ముద్దబంతి పువ్వా


కాళ్లపారాణి తో నా సఖీవై రావా............

Thursday, January 15, 2009

Oh Cheli....!!Oh Sakhi...!!!



ఓ చెలీ!!ఓ సఖీ...!!




నిను నవ్వించిన ప్రతిసారీ ప్రపంచాన్ని జయించననుకుంటా

నిను కవ్వించి ఓ సారి నీ చిరుకొపాన్ని చూడాలనుకుంటా


చెలి ఎల చెప్పను?? ఏమని చెప్పను??

నువ్వంటే నాకిష్టమని నువ్వుంటే ఈ జగమే నాదని

నువ్వు లేని నేను రాధలెని కృష్ణున్ని అవుతనని



నీతో ఊసులాడుతున్నప్పుడు ఆ గడియారాన్ని ఆపేయాలనుకుంటా

నీచిరు మాటకోసం ఎన్ని మైళైనా దాటి రావలనుకుంటా



నా ప్రతి స్వప్నంలో నువ్వు నాకు నిదుర సరిగా రానీవు

నా మనసులో చిద్విలాసంగా నువ్వు నా పనిని తిన్నగా చెసుకోనీవు


నిను ఎలా పోల్చను?? ఎవరితో పోల్చను??

నీ మోమును వెన్నెలతోనా?? నీ స్నేహాన్ని వసంతోనా?

అదిలేని నా మనసు అలజడుల సంద్రం అనా??

నీ ప్రతి పలుకు సరిగమలు ఒలుకు,నీ నడక ఆ నయగారాలకు ప్రతిరూపు

నీ వాలు కనులకేది సరితూగు ఆ నింగి లోని చంద్రలేఖ తప్ప






నిను చూసింది మొదలు ఇన్నళ్ళు కుదురుగా ఉన్న నా

మదిలో అలజడి రేగింది అది ప్రేమై కూర్చుంది



ఎంతమంది ఉన్నా నా కనులు నీ కొసం ఏదురుచుసెను

నీతో నడిచేప్పుడు మన ప్రయాణం ఆగాలనుకోను

ఓ సఖీ చెప్పు..........



నువ్వున్నది నా కొసం అని,నువ్వే నేనని....








Note:This is the one i never imagined i would write it in this way......
I was asked by my friend to write some thing which should look like a song ...
I just thought i should gine a try and wrote this.... This may be a naive kind but still i like it

Friday, October 17, 2008

GamYam...!!!

గమ్యం ...!!!
కనిపించే హరివిల్లుల లోకంలో
మసక లేని మనసులెన్ని...


దరి ఎరుగని గమనంలో
కడకు నిలుచు చెలిమేది

అన్తులేని పయనంలొ
మది నిండిన ఆశలతొ

దిశ తెలియని దరులలొ
ఓ ఇంతి నీ అడుగెటు??

గగనమే నీకై సగిరాదా ??
నీ నీడై నీ తొడవగా....

గమ్యమే పూలబాట కాదా??
నీ మనసె నీ గురువవగా....

Friday, January 11, 2008

O vanithaa.......

ఓ వనితా!!



కష్టానికి వెరవని నైజం

స్పస్టంగా ఉండే తత్వం

ఆకాశాన్ని తాకే ఆత్మవిశ్వాసం

శ్వేత వర్ణాన్ని తలపించే నిఇ మనసు

ఆ వెన్నలని మరిపిన్చే నీ మోము

ఎన్నొ వింతలను నీలొనే దాచిన

ఓ వనితా ఏమని వర్ణించను??

అలసట ఎరుగని నీ చూపు

సహనానికి నువ్వె ఓ ప్రతిరూపు

ఆ సంద్రం సరిపొవినా నీలొని

భావాల లొతును కొలిచేందుకు??

Wednesday, December 12, 2007

Mithramaa......

మిత్రమా...
కల్లెలెరుగని మల్లెకుసుమాలలా

మనసునిండిన ఆశాలతలతో

రెపటి ఉడయాన్ని ఈనాటి కళ్ళతో చూస్తూ

యల్లలు లేని ఆశయాలతో అడుగిడినాం ఈఆవరణంలో.......



మాలలోని పువ్వుల్లా నింగిలోని తరల్లా

కలసిమెలసి కలతమరచి ఎదిగాం ప్రతివసంతం

ఎన్నొ ఊసులను మనసులోనే భద్రపరచి

వీడిపొయే ఈ క్షణాలని మరచిపోకుమా మిత్రమా.....!!

Kavitha



@@కవిత@@



చిగురించిన కొమ్మలే ఊగగా

ఈ పచ్చని పైరే ఆడగా

కిలకిలమని చిలుకలే పలుకగా

విరబూసిన పూలే నవ్వగా

గలగల సెలయేరే పారగా

తెరతెరచి జాబిల్లే చుడగా

నా మదిలొ భావాలే మెదలగా

నా కలమే ఝరిలా సాగగా

భావాలకు ప్రాణం పోయనా

కలలను కావ్యంగా మలచనా

కమ్మని పాటే రాయనా

సరిగమలను సాయం అడగనా

తియ్యని రాగం పలకనా!!!

Tuesday, December 11, 2007

Vijetha


 విజేత

నిన్నటి స్మ్ర్రుతులు రెపటి స్వప్నాలు

తెలియని తీరానికి సాగే ఈ ప్రయాణం

కనిపించని గమ్యానికి కలలలోనే వారథి వేసి

ఊహలకందని లక్ష్యాన్ని అందుకొవాలి నిజంగా

ప్రతినిత్యం ఈ జీవితమే ఓ ఝఃర్షణ

వివెకంతొ ఎదురీది విజెతగా నిలవాలి

అనుక్షణం కళ్ళలొ కనిపించాలి ఆ తపన

ఆ నింగె హద్దుగా ఎదగాలి ఈ జగాన