Wednesday, December 12, 2007

Kavitha



@@కవిత@@



చిగురించిన కొమ్మలే ఊగగా

ఈ పచ్చని పైరే ఆడగా

కిలకిలమని చిలుకలే పలుకగా

విరబూసిన పూలే నవ్వగా

గలగల సెలయేరే పారగా

తెరతెరచి జాబిల్లే చుడగా

నా మదిలొ భావాలే మెదలగా

నా కలమే ఝరిలా సాగగా

భావాలకు ప్రాణం పోయనా

కలలను కావ్యంగా మలచనా

కమ్మని పాటే రాయనా

సరిగమలను సాయం అడగనా

తియ్యని రాగం పలకనా!!!

No comments: