Thursday, January 15, 2009

Oh Cheli....!!Oh Sakhi...!!!



ఓ చెలీ!!ఓ సఖీ...!!




నిను నవ్వించిన ప్రతిసారీ ప్రపంచాన్ని జయించననుకుంటా

నిను కవ్వించి ఓ సారి నీ చిరుకొపాన్ని చూడాలనుకుంటా


చెలి ఎల చెప్పను?? ఏమని చెప్పను??

నువ్వంటే నాకిష్టమని నువ్వుంటే ఈ జగమే నాదని

నువ్వు లేని నేను రాధలెని కృష్ణున్ని అవుతనని



నీతో ఊసులాడుతున్నప్పుడు ఆ గడియారాన్ని ఆపేయాలనుకుంటా

నీచిరు మాటకోసం ఎన్ని మైళైనా దాటి రావలనుకుంటా



నా ప్రతి స్వప్నంలో నువ్వు నాకు నిదుర సరిగా రానీవు

నా మనసులో చిద్విలాసంగా నువ్వు నా పనిని తిన్నగా చెసుకోనీవు


నిను ఎలా పోల్చను?? ఎవరితో పోల్చను??

నీ మోమును వెన్నెలతోనా?? నీ స్నేహాన్ని వసంతోనా?

అదిలేని నా మనసు అలజడుల సంద్రం అనా??

నీ ప్రతి పలుకు సరిగమలు ఒలుకు,నీ నడక ఆ నయగారాలకు ప్రతిరూపు

నీ వాలు కనులకేది సరితూగు ఆ నింగి లోని చంద్రలేఖ తప్ప






నిను చూసింది మొదలు ఇన్నళ్ళు కుదురుగా ఉన్న నా

మదిలో అలజడి రేగింది అది ప్రేమై కూర్చుంది



ఎంతమంది ఉన్నా నా కనులు నీ కొసం ఏదురుచుసెను

నీతో నడిచేప్పుడు మన ప్రయాణం ఆగాలనుకోను

ఓ సఖీ చెప్పు..........



నువ్వున్నది నా కొసం అని,నువ్వే నేనని....








Note:This is the one i never imagined i would write it in this way......
I was asked by my friend to write some thing which should look like a song ...
I just thought i should gine a try and wrote this.... This may be a naive kind but still i like it

No comments: