మా ఊరు
నా ఉదయం కోయిల కుహుకుహులతో చిలకల కిలకిలతో మొదలవ్వాలని ఉంది,
ముంగిలి లో ముగ్గు వేసి లొగిలిని పూలతో అలంకరించాలని ఉంది,
అమమ్మ చెప్పే తీపికబుర్లు వింటూ గోరుముద్దలు తినాలని ఉంది,
వినువీధి లోని తారలను ఆరుబయట కూర్చుని లెక్కపెట్టాలని ఉంది,
వెళ్లాలని ఉంది మా ఊరికి ,చల్లని చండమామ నీడలో సేద తీరాలని ఉంది
ఈ ప్రపంచానికి దూరంగా పచ్చని ప్రక్ర్రుతిలో కలసిన పల్లెకు...
కల్మషమెరుగని కాలానికి మమతనిండిన మనుషుల దరికి.........
1 comment:
నీ బ్లాగు..
బహు బాగు..జగమూగు..
నీ కవిత..
నీలా బాగుంది చాలా బాగుంది.
ఆశీస్సులతో..
మాధవ కృష్ణ
Post a Comment