Friday, November 13, 2009

Thellarindaa??? vadhannaa :(

తెల్లారిందా వధ్ధనా??



తెల్లారిందా వధ్ధనా కుడా??
తలగడని వదలాలని లేకున్నా
కళ్ళు కలలని వీడకున్నా
తప్పక మనసొప్పక........


మగీ తో బ్రేక్‌ఫాస్ట్ కాదంటే
బ్రెడ్ జాం స్యాండ్‌విచ్ కానిచ్చేస్తాం
స్కూల్ పిల్లల లాగా బ్యాగ్ వేసుకుంటాం
ఆర్మీ లో మేజర్ లాగా రెడీ అవుతాం


మెట్లేక్కే ఓపిక లేదు లిఫ్ట్ తో సరిపెడతాం
కంప్యూటర్ తో కుస్తీ స్టార్ట్ చేస్తాం
మరి ఇంకో రోజు యుధ్ధానికి సై అంటాం
కాఫీ బ్రేక్ లో సొల్లేస్తాం


లంచ్ టైమ్ కోసం క్లాక్ చూస్తూ
మేల్స్ చూస్తూ రిప్లై కొడుతూ
ఏదో సాదించిన ఫీలింగ్ లో
సురీడు కు టాటా చెప్పాలని మార్చిపోతాం


రేతిరి తారలు చూసి హాయ్ చెప్తే
ఒక నిట్టూర్పు తో డెన్ లోకి ఎంటర్ అవుతాం
చందమామ లాలి పాడుతున్న వినకుండా
నైట్ ఇస్ సో యంగ్ అంటూ గడిపేస్తాం


అలసి సొలసి డ్రీమ్స్ లోకి జారుకుంటాం
అప్పుడే తెల్లారిందా వధ్ధనా??












Saturday, October 17, 2009

Prakruthi.............Pralayam


ప్రళయం
మెఘాల మాటున శయనిన్చడనికి సిధ్దంగ ఉన్న సూరీడు...........
గూటికి చేరే గువ్వల కిలకిలలు.......
బంగారు కాంతులలొ అమ్మ మాటున సగుతున్న లేగదూడలు...........
ఆ సాయంత్రానికి అలసిన శ్రామికులు.....
పల్లె అందాలలో ఆ ప్రక్రుతి సొయగాలలోకనిపించె పరమాత్ముని చిత్రలెఖనై
ఎల వఱ్ణించను....
ఏమని చెప్పను ....
ధరీత్రిలొ అడుగడుగున అతని స్రుస్టి అద్భుతమని ...
కన్నులలొ నిండిన క్రుతగ్ఞత చూపడం తప్ప


ఛల్లగా చుసే ప్రక్రుతె ప్రలయాన్ని మొసుకొస్తే....
ఆ పుడమిని నమ్మిన పుత్రులకు బతుకె ప్రశ్నైతే ....
గల గల పారే గంగమ్మ పంటల్ని ముంచేస్తే...
ఎమని చెప్పను....
వసుధను నమ్మి బ్రతుకుతున్న మనిషి...
మట్టిపాలు అయిన జీవితన్ని...చూసి కంట తడి పెట్టటం తప్ప....


Thursday, April 9, 2009

Maa OOru


మా ఊరు

నా ఉదయం కోయిల కుహుకుహులతో చిలకల కిలకిలతో మొదలవ్వాలని ఉంది,

ముంగిలి లో ముగ్గు వేసి లొగిలిని పూలతో అలంకరించాలని ఉంది,

అమమ్మ చెప్పే తీపికబుర్లు వింటూ గోరుముద్దలు తినాలని ఉంది,

వినువీధి లోని తారలను ఆరుబయట కూర్చుని లెక్కపెట్టాలని ఉంది,

వెళ్లాలని ఉంది మా ఊరికి ,చల్లని చండమామ నీడలో సేద తీరాలని ఉంది

ఈ ప్రపంచానికి దూరంగా పచ్చని ప్రక్ర్రుతిలో కలసిన పల్లెకు...

కల్మషమెరుగని కాలానికి మమతనిండిన మనుషుల దరికి.........