తెల్లారిందా వధ్ధనా??
తెల్లారిందా వధ్ధనా కుడా??
తలగడని వదలాలని లేకున్నా
కళ్ళు కలలని వీడకున్నా
తప్పక మనసొప్పక........
మగీ తో బ్రేక్‌ఫాస్ట్ కాదంటే
బ్రెడ్ జాం స్యాండ్‌విచ్ కానిచ్చేస్తాం
స్కూల్ పిల్లల లాగా బ్యాగ్ వేసుకుంటాం
ఆర్మీ లో మేజర్ లాగా రెడీ అవుతాం
మెట్లేక్కే ఓపిక లేదు లిఫ్ట్ తో సరిపెడతాం
కంప్యూటర్ తో కుస్తీ స్టార్ట్ చేస్తాం
మరి ఇంకో రోజు యుధ్ధానికి సై అంటాం
కాఫీ బ్రేక్ లో సొల్లేస్తాం
లంచ్ టైమ్ కోసం క్లాక్ చూస్తూ
మేల్స్ చూస్తూ రిప్లై కొడుతూ
ఏదో సాదించిన ఫీలింగ్ లో
సురీడు కు టాటా చెప్పాలని మార్చిపోతాం
రేతిరి తారలు చూసి హాయ్ చెప్తే
ఒక నిట్టూర్పు తో డెన్ లోకి ఎంటర్ అవుతాం
చందమామ లాలి పాడుతున్న వినకుండా
నైట్ ఇస్ సో యంగ్ అంటూ గడిపేస్తాం
అలసి సొలసి డ్రీమ్స్ లోకి జారుకుంటాం
అప్పుడే తెల్లారిందా వధ్ధనా??
Friday, November 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment