శుభోదయం
చినుకుల సవ్వడులకు
చిగురించే కొమ్మలకు
పలికించే రాగాలకు
పులకించే హ్రుదయాలకు
అంతులేని నీలాకాశానికి
అందమైన హరివిల్లుకి
పచ్చని పైరులకి
ప్రవహంచే వాగులకి
కలలు కనె కన్నులకు
కనిపంచని ఊహలకు
మైమరిపంచే అందాలకు
మురిపంచే మనసుకు
మెరిసే తారలను సాగనంపి
విరిసే పువ్వులకి ఒక చిరినవ్వుతో
బాల భానుడు ముసుగు తీసి కనిపంచి
తెలియపరిచె అందరికీ శుభోదయం