Thursday, September 2, 2010

మురారి

నందనందనా గోపాలా నీ సాటి ఎవరయా
ఆబాలగోపాలాన్నలరించే నీ మంద హసం
మా వైపు ప్రసరించు యశోద నందనా
ఆ గీతాపాఠాన్ని మరు మారు వినిపించవయా


వెన్న దొంగవైన గోపాలా ఈ చిలిపిపనులేల?
కొంటె కోణంగివై కనిపించే గొకులపాలా
నీ మాయా లీలలిక ఆపవేలరా
గిరిధారీ కైమోడ్చెదను దయ చూపరార



పదమున మువ్వలు కరమున మురళి
శిరసున పింఛము యదపై పూమాల
నీలమేఘశ్యామా నిలిచెను నీయందే నా చుపు
అనందుకో నా ప్రణతులను దయతో

అనంత విశ్వమును నీయందే దచిన్న కన్నయా
నిను చుచుటకు చాలవాయ ఈ కనులు
ముగ్ధ మనోహరమగు నీ మోము
మురిపించి మరిపించును మనసులను

గోవర్దన గిరిని అవలీలగా ఎత్తిన సుకుమారా
నీ అండన నిలిచెదను విడవక నిను నిర్భయముగ
కాళింగ మర్దనము సలిపిన ధీరొత్తమా
నా అహమణచి దారి చూపువయా

Tuesday, July 6, 2010

తొలకరి


తొలకరి కై కనిపెట్టి ఉన్న మనసుకు
చిట పటమంటూ ఆ చిరుసవ్వడి
మనసులొని ఆశలన్ని కలబోసి
చిత్తడి లొ తడిసె చిన్నరులు



మోడువారిన నేలపై ముత్యపు మువ్వై
చిరుడివ్వై నేల పైన వాలింది
పల్లెకు పచ కోక కప్పుతూ
చిలకమ్మల విడిధి కై సై అంది..

Friday, January 22, 2010

Mudhabanthi puvva..



ముద్దబంతి పువ్వా.....




కలువ కన్నుల కన్నె


నిను ఏమని పొగడను


వాలు జడల వయ్యారి


నిను ఎలా వదలను




నీ మువ్వల సవ్వడి వినగానే


నా అడుగులు తడబడెను




నీ గాజుల గల గల అందగనే


నా మనసు వశము త ప్పెను




ప్పువ్వులతో చేసెనేటి నీ అధరలనా బ్రహ్మ


ముత్యాలు కూర్చిన ఆ ధారహాసం ఏమిటమ్మా??




పట్టు పరికినీ లోని ముద్దబంతి పువ్వా


కాళ్లపారాణి తో నా సఖీవై రావా............