Sunday, January 20, 2008

O My friend.........Nesthamaaa

అన్తులేని ఆకాశంలా ఆగని ఊసులు

లేలేత చిగురాకుల్లా చెరగని చిరునవ్వు

పసిపాప చిరునవ్వులా స్వఛమైన మనసు

జాజిమల్లె వలె మాయని మమకారం

ఇంథ్రథనస్సులోని రంగులవలె

అనుక్షణం అణువైనా వీడలేక వీడిపోక ఉన్నాం మనం





సంద్రంలోని అలజడి వలె

గ్రీష్మంలోని చిట్టడివి వలె

జాబిలి లేని రేయి వలె

ఉన్నది నీ స్నేహం లెని నా మనసు





కలసిన ప్రతిసారి అలుపెరుగక ఊసులాడి

వీడిపొయే క్షణాలలో కన్నీటి తఒనె సెలవ్...

రాయబారాలైనా మెఘసందేశాలైనా

వదలక ఆగక సాగిన ఆ పలకరింపులేవీ....??





మోముపై చిరునవ్వు కానదయె

స్వఛమైన మనసు మాయమాయె

కుట్రా కుతంత్రాలతో మలినమైన

ఈ ప్రపంచంలో మన స్నేహం నిలువదాయె





తిరిగిరాని ఆ క్షణాలను మరులరాని ఆ భంథాన్ని

కాస్త ఊహించినా ఊరటనిచి నా మనసు

సంద్రం మద్యలో ఉన్న ప్రశాంతతలా.....

Friday, January 11, 2008

O vanithaa.......

ఓ వనితా!!



కష్టానికి వెరవని నైజం

స్పస్టంగా ఉండే తత్వం

ఆకాశాన్ని తాకే ఆత్మవిశ్వాసం

శ్వేత వర్ణాన్ని తలపించే నిఇ మనసు

ఆ వెన్నలని మరిపిన్చే నీ మోము

ఎన్నొ వింతలను నీలొనే దాచిన

ఓ వనితా ఏమని వర్ణించను??

అలసట ఎరుగని నీ చూపు

సహనానికి నువ్వె ఓ ప్రతిరూపు

ఆ సంద్రం సరిపొవినా నీలొని

భావాల లొతును కొలిచేందుకు??