Tuesday, March 22, 2011

ఎలా చెప్పను??



ఎంత 
మిస్ అవుతున్నానంటే......





ఆకాశం లోని చుక్కలన్ని కలిసి రాశిపోసినంతగా


బుజ్జయి కేరింతనుకులకై వేచిచుసే కన్న తల్లి మురిపెమంత


జాజిమల్లెజడనుచుట్టిన పడతికేసి చూసె కుర్రాడిఆశ అంత


ముంగిలిలోన రంగవల్లి దిద్దగానే వాన తుడిచివేస్తె భారమైన మనసంత


నిను ఎలా దాచుకోను??


కలలో కనపడగనే కనుపాపలలో బంధీ చేసి చూసుకోనా


చిరుగాలిలో నీ మాట వినపడగనే గాలినలా ఆపనా


నువ్వు నా ముందుంటే సాగే సమయాన్ని వెనక్కి నెట్టనా


మనసున మనసై ఈ మాటే ఆ మంత్రమై కలిసుండమని కోరనా!!

Wednesday, February 2, 2011

ఆడగనా ....



వరమై వచ్చిన అడుగును
అడగనా ఒక చిన్న మాటను


విడువక నను వరుడై వచ్చి
కడ దాకా చెంతనుండమని

Thursday, September 2, 2010

మురారి

నందనందనా గోపాలా నీ సాటి ఎవరయా
ఆబాలగోపాలాన్నలరించే నీ మంద హసం
మా వైపు ప్రసరించు యశోద నందనా
ఆ గీతాపాఠాన్ని మరు మారు వినిపించవయా


వెన్న దొంగవైన గోపాలా ఈ చిలిపిపనులేల?
కొంటె కోణంగివై కనిపించే గొకులపాలా
నీ మాయా లీలలిక ఆపవేలరా
గిరిధారీ కైమోడ్చెదను దయ చూపరార



పదమున మువ్వలు కరమున మురళి
శిరసున పింఛము యదపై పూమాల
నీలమేఘశ్యామా నిలిచెను నీయందే నా చుపు
అనందుకో నా ప్రణతులను దయతో

అనంత విశ్వమును నీయందే దచిన్న కన్నయా
నిను చుచుటకు చాలవాయ ఈ కనులు
ముగ్ధ మనోహరమగు నీ మోము
మురిపించి మరిపించును మనసులను

గోవర్దన గిరిని అవలీలగా ఎత్తిన సుకుమారా
నీ అండన నిలిచెదను విడవక నిను నిర్భయముగ
కాళింగ మర్దనము సలిపిన ధీరొత్తమా
నా అహమణచి దారి చూపువయా