Wednesday, February 8, 2012

Baapu Bomma

అబ్బాయి:


చెలి పాదాల పారాణినై ఉండిపోనా

అందెల మువ్వాల సరిగమాలు వింటూ




ముద్దబంతి పువ్వునై శిగలో చేరనా
పట్టు కురుల మద్య ఊయల ఊగుతూ


నడుం ఓంపుల్లో చేరి వడ్దాణమై నిలువనా
ముత్యాల హారాన్నై యాడాపై కొలువవనా



అందానికే నిర్వచనమైన నీ సొగాసును
చిరు గలిలా వచ్చి చుట్టేసుకోనా


కాటికనై నీ వాలు కళ్ళలో దాగి
కలువల అందాన్ని కనిపెట్టుకుని ఉండనా


సింధురమై నుదుటన ఉండిపోనా
నిరంతరం నీ నిడనై సాగిపోనా



అమ్మాయి:

నిజమేనా అనిపించేలా నీ మాటలు వింటున్నా
కలనైనా వీడలేవా నే నడిచే దారినలా


అతిశయమే కనిపించెనా నీ పలుకులలో
గాలిలోన వంతెన కడితే నమ్మెదెలా


సరసమైనా విరాసమైనా వేళ పాళా అంటూ లేదా
ఎదుటనే నువ్వు నించుంటే బాటలోన వెళ్ళెదేలా


అబ్బాయి:

నిండు పున్నమి జాబిలైన ఆ మోము లో
అలల అలజడికి కారణం నేనా


చెలి చిరాకులను నిమిషం అయీన తాళలేను
కందిపోయే చెంపలకు చినుకై తగలనా


పంటికింద నకిగి పోయే పెదవులను చూడాలేకున్నా
దారి విడిచా ప్రియతమా నీ దారిలో నే నడవనా



అమ్మాయి:

మాటలనే కూర్చి నా మనసునీమార్చేవే ఇలా
నా దారినీ మళ్ళించి నీ వైపుకు చేర్చావే అలా


ఆగని మనసును నీ చెంతకు పంపించా
గుండెలోని ఊసులన్నీ పలికిస్తా నీ చెంత


మనువాడే మనిషి రాముడైనప్పుడు
బాసటగా నిలిచేను సీతమ్మాలా